Russia Attack : అవ్వ-మనవడి మృతి

ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ నగరంపై రష్యా శుక్రవారం జరిపిన క్షిపణి దాడిలో 10 సంవత్సరాల బాలుడు, అతని అవ్వ దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున దాడి జరిగిన వెంటనే కూలిన భవన శిథిలాల నుంచి బాలుడి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. ఇదే దాడిలో 11 నెలల చిన్నారి సహా 30 మంది గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.