Rocket Attack : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశ తూర్పు ప్రాంతం ఖర్కివ్‌లోని హ్రోజా గ్రామంలో కెఫేపై గురువారం జరిగిన రాకెట్ దాడిలో సుమారు 50 మంది పౌరులు మృతి చెందారు. ఆ సమయానికి కెఫేలో 60 మంది వరకూ ఉన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అతిపెద్ద ప్రాణనష్టం ఇదే. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ఘటనను ధ్రువీకరించారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడూ ఉన్నట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. దాడికి ఉపయోగించింది ఇస్కందర్ క్షిపణిగా గుర్తించారు. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని ఒడెసా, మైకోలైవ్, కిరోవ్ హ్రాడ్‌లపై రష్యా గురువారం తెల్లవారుజామున డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ తయారీ 29 డ్రోన్లలో 24 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది.