Rishi Sunak’s wife’s shares have caused controversy – రిషి సునక్ భార్య షేర్లు వివాదానికి కారణమయ్యాయి

ఓ బాలల సంరక్షణాలయంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి పెట్టుబడుల గురించి తలెత్తిన వివాదంలో సునాక్ సిబ్బంది వ్యవహరించిన తీరును పార్లమెంటు ప్రమాణాల సంఘం ఆక్షేపించింది. బాలల సంరక్షణ బాధ్యత తీసుకునేవారికి 600 పౌండ్ల చొప్పున నగదు ప్రోత్సాహకం ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం వసంతకాల బడ్జెట్‌లో ఓ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. ఏదైనా సంస్థ ద్వారా చేరే సంరక్షకులకు 1,200 పౌండ్లను చెల్లించడానికి ఈ కార్యక్రమంలో వెసులుబాటు ఉంది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఆరు బాలల సంరక్షణ సంస్థల్లో కోరు కిడ్స్ ఒకటి. అందులో ప్రధాని భార్య అక్షతా మూర్తికి వాటాలు ఉన్నాయి. ఈ సంగతిని ప్రధాని రిషి సునాక్ సాధికారంగా పేర్కొనకపోవడం సందిగ్ధం వల్ల జరిగిన పొరపాటు అని ఈ వ్యవహారంపై ఆంతరంగికంగా దర్యాప్తు జరుపుతున్న పార్లమెంటు ప్రమాణాల సంఘం గత నెలలో తేల్చింది. తమ పొరపాటును సునాక్ కూడా అంగీకరించినందున ఎటువంటి చర్య తీసుకోనక్కర్లేదని పేర్కొంది. అయితే ప్రధాని కార్యాలయ సిబ్బంది ఈ దర్యాప్తు గురించి బహిర్గతం చేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు జాగ్రత్త పాటించాలని కోరింది.