#International news

NASA responded about the Strange shapes that appeared in the Parliament of Mexico – మెక్సికో పార్లమెంటులో కనిపించిన వింత ఆకృతులపై నాసా స్పందించింది

గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా(Alien corpses) భావిస్తున్న రెండు వింత ఆకారాలను కొందరు పరిశోధకులు మెక్సికో(Mexico) పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. దీనిపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా(NASA) తన అభిప్రాయం వ్యక్తం చేసింది. వాస్తవంగా అవి ఏంటో స్పష్టత లేదని, అయితే ఈ విషయంలో పారదర్శకత ముఖ్యమని పేర్కొంది.

మెక్సికో(Mexico) పార్లమెంట్‌లో వింత ఆకారాల ప్రదర్శన గురించి మాట్లాడుతూ..‘సామాజిక మాధ్యమాల్లోనే నేను వీటిని చూశాను. ఏవైనా అసాధారణ విషయాలు మీ దృష్టికి వచ్చినప్పుడు.. వాటికి సంబంధించిన సమాచారం తెలియాలనుకుంటారు. అయితే ఆ ఆకారాలు దేనికి సంబంధించినవో స్పష్టత లేదు. ఏదైనా వింతగా అనిపించినప్పుడు.. వాటిని శాస్త్రీయ నిపుణుల ముందుకు తీసుకెళ్లాలి’ అని మెక్సికో ప్రభుత్వాన్ని ఉద్దేశించి నాసా ప్రతినిధి సూచన చేశారు.

పెరూలోని నజ్కా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో 2017లో రెండు విచిత్ర ఆకారాలు బయటపడ్డాయి. అవి గ్రహాంతరవాసులవేనని అప్పటి నుంచి పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా బయటపడ్డ వాస్తవాలను మెక్సికో కాంగ్రెస్‌ సభ్యులకు తెలియజేసేందుకు.. ఆ రెండు ఆకారాలను పరిశోధకులు పార్లమెంటుకు తీసుకొచ్చారు.  ఆ వింత ఆకారాలు గ్రహాంతరవాసులవేనని పక్కాగా ఇప్పుడే తాము చెప్పడం లేదన్నారు.

NASA responded about the Strange shapes that appeared in the Parliament of Mexico – మెక్సికో పార్లమెంటులో కనిపించిన వింత ఆకృతులపై నాసా స్పందించింది

The plane descended 28 thousand feet within

NASA responded about the Strange shapes that appeared in the Parliament of Mexico – మెక్సికో పార్లమెంటులో కనిపించిన వింత ఆకృతులపై నాసా స్పందించింది

Nipah – A virus which is more

Leave a comment

Your email address will not be published. Required fields are marked *