#International news

Mexico : ఘోర బస్సు ప్రమాదం..

మెక్సికో (Mexico)లో ఘోర బస్సు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తోన్న బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 18 మంది మృతి చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దక్షిణ మెక్సికోలోని వుహకా-పేబ్లా ప్రాంతాలను కలిపే రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతుల్లో వెనుజువెలా, హైతికి చెందిన ముగ్గురు మైనర్లున్నారు. వివిధ దేశాలకు చెందిన వేలాది మంది తరచూ మెక్సికో గుండా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే వలసదారులతో మెక్సికో-అమెరికా సరిహద్దు ప్రాంతానికి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. గత ఆగస్టు, సెప్టెంబర్‌లోనూ ఇలాంటి వాహనాలు ప్రమాదానికి గురై పదుల సంఖ్యలో వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *