Kim Jong Un has invited Putin to visit his country… – కిమ్ జోంగ్ ఉన్ తన దేశాన్ని సందర్శించాల్సిందిగా పుతిన్‌ను కోరారు

రష్యా పర్యటనలో ఉన్న ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. తమ దేశంలో పర్యటించాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు. దీనికి రష్యా అధ్యక్షుడు కూడా అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. మరోవైపు ఇరువురు నేతల చర్చల్లో ప్రధానంగా సైనిక అంశాలే ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. ఇటీవల ఉత్తరకొరియా చేసిన క్షిపణి ప్రయోగాలు చాలా సందర్భాల్లో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో రష్యా అందించే టెక్నాలజీ కీలకమని కిమ్ భావిస్తున్నారు. మరోవైపు ఉత్తరకొరియా ఉపగ్రహ, అంతరిక్ష కార్యక్రమాలను అభివృద్ధి చేసేందుకు పుతిన్ సానుకూలత కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదని రష్యా చెబుతోంది. శుక్రవారం కిమ్.. రష్యాలోని కమ్స్‌మలస్కాన్ అముర్‌లో యుద్ధ విమానాలు తయారు చేసే ప్లాంట్‌ను సందర్శించారు.