#International news

Israel-Hamas : గాజాపై దండయాత్రకు సిద్ధమే

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతోన్న పోరు (Israel Hamas Conflict) ప్రస్తుతం తగ్గుముుఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. హమాస్‌ ఉగ్రవాదుల చెరలో బందీలను కాపాడే విషయంలో ఇజ్రాయెల్‌ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో గాజాపై భూతల దాడులకు సిద్ధమైన టెల్‌అవీవ్‌.. సరిహద్దు ప్రాంతంలో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఈ నేపథ్యంలో గాజాపై దండయాత్రకు (Invasion) తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (IDF) మరోసారి స్పష్టం చేసింది.

‘ఒక మాట స్పష్టంగా చెప్పదలచుకున్నా. గాజాపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నాం. గాజాలో చొరబాటుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం. ఇందు కోసం దేశాధినేతలతో సమన్వయంతో పనిచేస్తున్నాం’ అని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ హెర్జీ హలేవీ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శత్రువుపై దాడి చేయడానికి ప్రతి నిమిషాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. అటు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కూడా తదుపరి పోరుకు సిద్ధంగా ఉన్నామంటు వ్యాఖ్యానించారు. ఇలా గాజాపై దండయాత్ర అనివార్యమని ఇజ్రాయెల్‌ భావిస్తున్న తరుణంలో అమెరికా మరోసారి స్పందించింది. గాజాపై భూతల దాడుల అంశంపై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ స్వయంగా నిర్ణయాలు తీసుకోగలదని స్పష్టం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *