Fragments of a missing fighter jet worth hundreds of crores have been found in America – అమెరికాలో అదృశ్యమైన వందల కోట్ల విలువైన యుద్ధ విమాన భాగాలు లభ్యమయ్యాయి

అమెరికాలో(America) కనిపించకుండా పోయిన వందల కోట్ల విలువైన ఫైటర్ జెట్ (Fighter Jet) శకలాలు లభ్యమయ్యాయి. సౌత్ కరోలినాలోని విలియమ్స్‌బర్గ్ కౌంటీలో విమానం శకలాలను గుర్తించినట్లు యూఎస్ మిలటరీ(US Military) ప్రకటించింది. ఈ శిథిలాలను సేకరించడానికి స్థానికులను అక్కడి రాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఆదివారం సౌత్ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్ ఎఫ్-35B(F-35B Fighter Jet) జాడ లేకుండా పోయిన విషయం తెలిసిందే.
దక్షిణ కరోలినాలో ఫైటర్ జెట్ మిస్ కావడంతో జాడ తెలిస్తే చెప్పాలంటూ అధికారులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక పలు ఫ్లైట్ ట్రాకింగ్ సైట్‌లు విలియమ్స్‌బర్గ్ కౌంటీలోని స్టకీకి సమీపంలో ఉన్న అడవుల్లో సంచరించినట్లు సూచించాయి. మరోవైపు ఈ విమానం కూలడానికంటే ముందే పైలట్ పారాషూట్ సహాయంతో దాన్నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఎఫ్-35 లైట్‌నింగ్ II జెట్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. దీనిలో అధునాతన ఫీచర్లు, రాడార్ గుర్తించకుండా ఉండే వ్యవస్థలు ఉన్నాయి. ఇక ఫైటర్ జెట్‌ను మిస్ కావడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేశారు. విమానం జాడ కనిపెట్టిన వారికి రివార్డు అందివ్వనున్నట్లు సదరు విమానం ఫొటోలను మార్పు చేసి పోస్టు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎఫ్-35 ముందు నిల్చుని దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మరొక యూజరు ఫొటో మార్పు చేసి పోస్టు చేశాడు.