Four workers died after the lift collapsed in Greater Noida – గ్రేటర్ నోయిడాలో లిఫ్ట్ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి

గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కుప్పకూలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ సొసైటీలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కార్మికులతో బయలుదేరి వెళ్తూ 14వ ఫ్లోర్ నుంచి అకస్మాత్తుగా జారు కుంటూ వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దీంతో లిఫ్టులోని నలుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధి తులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలసకార్మికులని పోలీసులు తెలిపారు.