#International news

Cancer – మెరుగైన వైద్యం

క్యాన్సర్‌ బాధితులకు తక్కువ ఖర్చులో, వేగంగా మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక ఆవిష్కరణ చేపట్టారు. క్యాన్సర్‌ కణాలను సులభంగా అధ్యయనం చేసేందుకు త్రీడీ ముద్రిత విధానంలో కణితి నమూనాలను సృష్టించే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం అత్యాధునిక బయోప్రింటింగ్‌ సాంకేతికతలతోపాటు మైక్రోఫ్లూయిడిక్‌ చిప్‌లను ఉపయోగించారు. సంప్రదాయబద్ధ బయాప్సీ విధానంలో 2డీ కణితి నమూనాలు అందుబాటులో ఉంటాయని, వాటిని లోతుగా పరిశీలించడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన త్రీడీ నమూనాలతో కణితి సంక్లిష్ట నిర్మాణాన్ని, క్యాన్సర్‌ రకాన్ని క్షుణ్నంగా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రధానంగా ఒకటి కంటే ఎక్కువ క్యాన్సర్‌ కణాలను కలిగి ఉన్న కణతుల విషయంలో ఈ సాంకేతికత మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వివిధ రకాల కీమోథెరపీ ఔషధాలను ఈ నమూనాలపై ముందుగానే పరీక్షించొచ్చని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *