A bus carrying passengers plunged down the hill into the valley in Peru – ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పెరూలోని కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లింది

దక్షిణ అమెరికా(South America) దేశమైన పెరూ(Peru) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 24 మంది చనిపోగా 35 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్నలో లోయలో పడింది. దీంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. ఇదే ప్రాంతంలో గత నెల బస్సు ప్రమాదం జరిగి 13 మంది చనిపోయారు. పెరూలో సరైన రోడ్డు సదుపాయాలు లేక ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది. ఇక్కడ రాత్రిపూట, పర్వతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.