Hanamkonda – కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జంగా రాఘవరెడ్డి.

హనుమకొండ;తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాను వెల్లడించినప్పటి నుంచి టిక్కెట్లు దక్కని పలువురు ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు జంగా రాఘవ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. రాయిఘవరెడ్డికి కాంగ్రెస్ టికెట్ రాకవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్య నేతలతో అత్యవసరంగా చర్చించిన అనంతరం ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ టికెట్ దక్కని జంగా రాఘవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాఘవరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి మాట్లాడుతున్నారు.అటు మరో కాంగ్రెస్ నేత ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కూడా అనుచరులతో సమావేశమయ్యారు. పరకాల టికెట్ ఆశించి ఇనగాల భంగపడ్డారు. దీంతో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.