Renu Desai: రేణూ దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్
ఆగస్టులో తాను పెట్టిన ఓ పోస్ట్‌పై నెటిజన్ కామెంట్ చేయగా నటి రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే?‘తెలుగు చలన చిత్ర పరిశ్రమ కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించింది కాదు.. అందరిదీ. మమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించకండి’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘తప్పుదోవ పట్టించేందుకు మీరేమైనా చిన్నపిల్లాడా? ముర్ఖులా? మీరు పరిష్కారం లభించని సమస్యలతో ఉన్న వ్యక్తి. మీరు చేయలేని దాన్ని ఇతరులు చేస్తే వారిని నిందించాలనుకుంటారు. పూర్తిగా చదివితే నేను వ్యక్తం చేసిన అభిప్రాయం అర్థమవుతుంది’’ అని అన్నారు. రేణూ స్పందనపై సదరు నెటిజన్ మరో కామెంట్ పెట్టాడు. బాలీవుడ్‌లోని బంధుప్రీతి గురించి ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు అందరికీ అర్థమైందని, కొన్ని కుటుంబాలు టాలీవుడ్‌ని ఎలా కంట్రోల్ చేస్తాయో త్వరలోనే తెలుస్తుందని సమాధానమిచ్చాడు. జీవితం అంటే ఏంటో తనకు తెలుసని, అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండన్నాడు. సరే నన్ను నేను ప్రశ్నించుకుంటానని ఆమె రిప్లై ఇచ్చారు. అపరిచిత వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించడం మీ బలం అని పేర్కొన్నారు.