Rajinikanth – మూడు దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబో రిపీట్..

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తన ఆప్త మిత్రుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తో కలిసి పని చేయడంపై నటుడు రజనీకాంత్ (Rajinikanth) స్పందించారు. ‘‘33 ఏళ్ల తర్వాత నా మార్గదర్శి, అద్భుతమైన వ్యక్తి అమితాబ్ బచ్చన్‌తో కలిసి వర్క్ చేస్తున్నా. లైకా ప్రొడెక్షన్స్ పతాకంపై టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రంలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అమితానందంతో నా మనసు నిండింది’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు.
అమితాబ్ బచ్చన్‌తో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు లెజండరీ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఆనందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కోసం తాము ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
‘జైలర్’ తర్వాత రజనీకాంత్ నటిస్తోన్న చిత్రమిది. ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవర్‌ఫుల్ కథాంశంతో ఇది సిద్ధం కానుంది. లైకా ప్రొడెక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. అమితాబ్ బచ్చన్‌తోపాటు రానా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ – రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అందాకా నూన్’, ‘గిరాఫ్తార్’ వంటి సినిమాలు విశేష ప్రేక్షకాదరణ అందుకున్నాయి. 1991లో విడుదలైన ‘హమ్’ తర్వాత వీరు కలిసి నటించలేదు.6