#Entertainment

Akshay Kumar – రూమర్స్‌ని ఖండించారు….

తనపై వస్తున్న రూమర్స్‌ను బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ఖండించారు. ఆయన మళ్లీ పాన్‌ మసాలా ప్రకటనలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన అక్షయ్‌.. వివరణ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

అక్షయ్‌ కుమార్‌ గతంలో నటించిన ఓ పాన్ మసాలా ప్రకటన సోషల్‌ మీడియాలో తాజాగా షేర్‌ అవుతోంది. దీంతో ఆయన మళ్లీ ఆ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. వీటిపై స్పందించిన అక్షయ్‌.. ‘‘ప్రస్తుతం వస్తోన్న ప్రకటన 2021 అక్టోబర్‌లో చిత్రీకరించినది. అగ్రిమెంట్‌ ప్రకారం దీన్ని 2023 నవంబర్‌ వరకు ప్రసారం చెయొచ్చు. అంతే కానీ, ఇది ఇప్పుడు చిత్రీకరించింది కాదు. నేను ఇలాంటి ప్రకటనల్లో నటించనని బహిరంగంగానే వెల్లడించాను. ఆ ప్రకటన తర్వాత నేను ఇప్పటి వరకూ ఇలాంటి వాటిల్లో నటించలేదు. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’’ అంటూ రాసుకొచ్చారు. 

గతంలోనూ ఇలాంటి రూమర్స్‌రాగా అక్షయ్‌ కుమార్‌ అప్పుడు కూడా వీటిని ఖండించారు. నిర్దేశిత వ్యవధి వరకు ఆ ప్రకటనను ప్రసారం చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు. అలాగే దాని కోసం తాను తీసుకున్న డబ్బును కూడా ఒక మంచి పనికి వినియోగించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి వాటి ఎంపికలో జాగ్రత్త పడతానని చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘ఓమైగాడ్‌2’తో విజయాన్ని అందుకున్నారు అక్షయ్‌ కుమార్‌. తాజాగా ‘మిషన్‌ రాణిగంజ్‌’తో (Mission Raniganj) పలకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *