Telangana: State Emblem Should Reflect Telangana Movement : తెలంగాణ గీతం, చిహ్నంపై ఆగని మాటల యుద్ధం.. రేవంత్ సర్కార్ నిర్ణయంపై బీఆర్ఎస్ పోరుబాట

రాచరికపు ఆనవాళ్లు.. రాష్ట్ర చిహ్నంలో ఉండొద్దని ఆదేశించడంతో.. పలు నమునాలు ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా.. అమరుల త్యాగాలు ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని.. ఇప్పటికే సీఎం రేవంత్ హింట్ ఇచ్చారు.
తెలంగాణ రాజముద్ర, రాష్ట్ర గీతంపై వివాదం కొనసాగుతోంది. గతంలో ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులు చేయిస్తుంది కాంగ్రెస్ సర్కార్. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాచరికపు ఆనవాళ్లు.. రాష్ట్ర చిహ్నంలో ఉండొద్దని ఆదేశించడంతో.. పలు నమునాలు ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా.. అమరుల త్యాగాలు ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని.. ఇప్పటికే సీఎం రేవంత్ హింట్ ఇచ్చారు. ఆ మేరకు నాలుగైదు నమూనాలు కూడా పరిశీలించారు. నిన్న సీఎం ముందుంచున్న నమూనాల్లో కాకతీయ తోరణం లేదు. ఒక లోగోలో చార్మినార్, మరో లోగోలో బుద్ధుడు ఉన్నారు. అమరుల స్థూపం ఉండేలా మరో లోగో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ఏది ఫైనల్ చేస్తారన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
రాష్ట్ర చిహ్నంలో.. కాకతీయ తోరణం, చార్మినార్ తీసెయ్యడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. చార్మినార్ దగ్గర నిరసనలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. లోగోలో తెలంగాణ చారిత్రక కట్టడాల తొలగిస్తే ఉద్యమిస్తామంటూ నిన్న సాయంత్రం వరంగల్‌లో ధర్నా చేశారు బీఆర్ఎస్ నేతలు. మార్పులు చేర్పులపై కమిటీ వేస్తామన్న సీఎం రేవంత్.. వ్యక్తిగత ద్వేషంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర గీతాన్ని ఆంధ్రాకు చెందిన కీరవాణితో కంపోజ్ చేయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లోగోలో మార్పులపై హైకోర్ట్‌కు వెళ్తామన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్. అధికారిక చిహ్నం మార్చడం సాధ్యం కాదని.. దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు.