#Elections #Top Stories

Elections 2024: Election code rules & Regulations ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!

దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని కూడా మార్చి 16 కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా కోడ్‌ అమలులో ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ కోడ్‌ అమలులో ఉంటుంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది.

దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని కూడా మార్చి 16 కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా కోడ్‌ అమలులో ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ కోడ్‌ అమలులో ఉంటుంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా పార్టీలు, అభ్యర్ధులు ఎలాంటి పనులు నిర్వహించవచ్చు? ఎలాంటికార్యక్రమాలు నిర్వహించకూడదు, ఎలాంటి నిబంధనలు అమలులో ఉంటాయి అనే అంశాలు ఇప్పుడు చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు,ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించే అధికారం ఎలక్షన్ కమిషన్‌(EC)కి ఉంటుంది. ఎన్నికల కోడ్ ప్రకారం.. రాజకీయ పార్టీలు, నాయకులు తమ ప్రత్యర్థులను కేవలం వారి పనితీరు మీదే విమర్శలు చేయాలి. కులం, మతం, జాతి ఆధారంగా ఎలాంటి ఆరోపణలు చేయకూడదు. అనధికార పత్రాలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేయకూడదు. ప్రభుత్వ పథకాలు, పనులు, ప్రాజెక్టులు కొత్తగా ప్రారంభించడానికి వీలు పడదు. ఇంతకుముందు ప్రారంభించిన పనులను కొనసాగించుకోవచ్చు.

అలాగే అధికార పార్టీ ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ వెబ్ సైట్లలో ఉన్న ప్రకటలను కూడా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు అభివృద్ది పనుల కోసం నిధులు విడుదల చేయడానికి వీలు పడదు. ఇక కోడ్ అమల్లో ఉండగా ఎవరికీ గన్ లైసెన్స్ కూడా ఇవ్వరు. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించడం, బీపీఎల్ కుటుంబాలకు ఎల్లో కార్డులు జారీ చేయడం లాంటివి ప్రభుత్వాలు చేయడానికి అవకాశం ఉండదు. ఇక ప్రభుత్వ నిధులతో పార్టీ నేతలు తమ ఇంటి వద్ద కార్యక్రమాలు చేయకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు వాటిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు, నేతలపై దర్యాప్తు చేయడానికి, వారికి శిక్ష విధించేందుకు ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *