Ysrcp Candidates Full List YS Jagan : 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. ఫుల్ లిస్ట్ ఇదే..!

ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ముందుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్, అక్కడి నుంచి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్న వారి జాబితాను ప్రకటించారు. ఈసారి విజయం వరించడం కోసం ఎన్నికల జైత్రయాత్రను ప్రారంభించే ముందు తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ముందుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్, అక్కడి నుంచి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్న వారి జాబితాను ప్రకటించారు. ఈసారి విజయం వరించడం కోసం ఎన్నికల జైత్రయాత్రను ప్రారంభించే ముందు తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. మార్చి 16న అభ్యర్థుల 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా.. ఎంపీ నందిగామ సురేష్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మార్చి 18న ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను గతం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, కడప స్థానిక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.