YS Sharmila: YS Sharmila is contesting from that constituency..! ఆ నియోజవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ..! కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించేది అప్పుడే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. శరణమా..!! రణమా..! అంటూ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక.. ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ కూటమి) సరికొత్త జోష్ తో తాము సిద్ధమంటూ కదనరంగంలోకి అడుగేశాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన చాలాచోట్ల అభ్యర్థులను ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. శరణమా..!! రణమా..! అంటూ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక.. ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ కూటమి) సరికొత్త జోష్ తో తాము సిద్ధమంటూ కదనరంగంలోకి అడుగేశాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన చాలాచోట్ల అభ్యర్థులను ప్రకటించాయి. ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ కూడా త్వరలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అటు వైసీపీ.. ఇటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల సంగ్రామంలో స్పీడును పెంచాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. వైఎస్ షర్మిలను పార్టీ చీఫ్ గా ప్రకటించిన నాటినుంచి దూకుడుగా ముందుకువెళ్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అమలు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరిగా.. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పక్కా హామీలంటూ ఇటీవల విడుదల చేసింది. తాము ఎన్నికల్లో గెలిస్తే ఇవి పక్కాగా అమలు చేస్తామంటూ ఖర్గే సైతం ప్రకటించారు. అంతేకాకుండా.. ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వైఎస్ షర్మిల ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పిన రేవంత్ రెడ్డి.. తనకు అండగా ఉంటానంటూ ప్రకటించారు.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా..? అనే సందేహాల నడుమ షర్మిల కూడా తన పదునైన మాటలతో అటు అన్న వైఎస్ ప్రభుత్వాన్ని, ఇటు విపక్ష పార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. అయితే, షర్మిల పోటీపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మొదట వైఎస్ షర్మిల పోటీలో ఉండరంటూ ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తరువాత పోటీలో ఉంటారంటూ క్లారిటీ వచ్చింది. APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కడప ఎంపీ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ.. అధిష్టానం కూడా పలు సూచనలు చేసినట్లు సమాచారం.. కడప నుంచి పోటీ చేయాలని ఢిల్లీ పెద్దలు షర్మిలను కోరుతున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకా మృతి తర్వాత జరిగిన పరిణామాలు.. సునీత.. వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో షర్మిల కడప నుంచి పోటీచేస్తే మంచి ఫలితం ఉంటుదని ఢిల్లీ పెద్దలు పేర్కొంటున్నట్లు సమాచారం..
అయితే, షర్మిల అభిప్రాయాన్ని బట్టి పార్టీ అధిష్టానం డిసైడ్ చేయనున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం ఉండటంతో షర్మిల పోటీపై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలాఉంటే.. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ అవినాష్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఇక్కడ నుంచి వైఎస్ షర్మిలా కూడా పోటీచేస్తే సొంత కుటుంబంలో హోరాహోరి పోరు తప్పదని తెలుస్తోంది. కాగా.. టీడీపీ కూడా ఇక్కడ కీలకమైన వ్యక్తికే సీటు కేటాయించాలని ప్రయత్నిస్తోంది.. దీంతో ఈసారి కడపలో త్రిముఖ పోరు ఖాయమని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు..