#ANDHRA ELECTIONS #Elections

YS JAGAN : Sidham Bus Yatra ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నాలుగోరోజు షెడ్యూల్ ఇదే..

Memantha Siddham Bus Yatra 4th Day : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రతో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్‌. ప్రస్తుతం కర్నూలు జిల్లాను చుట్టేస్తున్నారు. మూడో రోజు కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రతో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్‌. ప్రస్తుతం కర్నూలు జిల్లాను చుట్టేస్తున్నారు. మూడో రోజు కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ.. వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మిగనూరు సభలో ప్రసంగించిన సీఎం జగన్‌.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. విపక్షాల ఎత్తులను, జిత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఇక.. ఎమ్మిగనూరు సభా వేదికపై రెండు అంశాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. శింగనమల వైసీపీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు సీఎం జగన్‌. చంద్రబాబు పాలన కారణంగా డిగ్రీలు చేసిన వ్యక్తులు టిప్పర్‌ డ్రైవర్లుగా.. ఉపాధి హామీ కూలీలుగా మారితే.. వారికి వైసీపీ టిక్కెట్‌లు ఇచ్చి అక్కున చేర్చుకుందని చెప్పారు.

కాగా.. ఇవాళ కర్నూలు జిల్లా రాతన నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర మొదలై అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. జగన్ రాతన నుంచి తుగ్గలి చేరుకుని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత గరిగెట్ల క్రాస్‌ మీదుగా జొన్నగిరి, బసినేపల్లి, గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటికలపల్లి మీదుగా క్రిష్ణంరెడ్డిపల్లి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు సీఎం జగన్‌.

మేమంతా సిద్ధం – 4వ రోజు శనివారం (మార్చి 30) షెడ్యూల్ ఇలా..

సీఎం జగన్ బస్ యాత్రలో భాగంగా నాలుగవ రోజు ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు గ్రామస్థులతో ముఖముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో భోజన విరామం తీసుకుంటారు.

సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది.

సంజీవపురం శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *