#ANDHRA ELECTIONS #Elections

 Ys Jagan Mohan Reddy Reached The State Today After Completing His Foreign Tour : ముగిసిన సీఎం జగన్‌ విదేశీ టూర్.. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ హీట్‌ పీక్‌కి చేరింది. జూన్‌ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఫలితాలపై ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మే 13వ తేదీన పోలింగ్‌ ముగిశాక వెకేషన్‌కు వెళ్లిన నేతలంతా ఒక్కొక్కరుగా ఏపీకి తిరిగి చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకోనున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది హేను రోజుల తర్వాత విదేశీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకుంటున్నారు. వైఎస్ జగన్, భార్య భారతితో కలసి ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా పర్యటించారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలసి స్విట్జర్లాండ్ లో పర్యటించారు. పదిహేను రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నేడు రాష్ట్రానికి చేరుకోనున్నారు. మే 30న రాత్రి లండన్ నుంచి జగన్ దంపతులు తిరుగు ప్రయాణమై, శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. జగన్ వస్తుండటంతో విమానాశ్రయంలో పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక విమానంలో లండన్‌ నుంచి బయల్దేరనున్న జగన్‌… నేరుగా గన్నవరం చేరుకున్నారు. అక్కడ్నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్ళారు సీఎం జగన్. రావడం రావడమే కౌంటింగ్‌ డే కోసం పార్టీ నేతలతో కసరత్తు చేశారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దిశానిర్దేశం చేశారు జగన్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *