Yarapatineni- Eid Mubarak : “సబ్ కో ఈద్ ముబారక్” రంజాన్ శుభాకాంక్షలు – గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు.

పిడుగురాళ్ల న్యూస్ –11-04-2024: పిడుగురాళ్ల పట్టణం లోని యరపతినేని నగర్ లోని మూడు ఎకరాల స్థలంలో 50 లక్షల ఖర్చుతో గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారిచే నిర్మాణం చేసుకున్న ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ఈదుల్ ఫితర్ నమాజ్ చదివి ఆనందోత్సహలతో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ నమాజ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, “పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎంతో నియమనిష్టలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు తీసుకుని ఉపవాసాలు ఉండి ఉపవాస దీక్షలు ముగించి, ఈదుల్ ఫితర్ నమాజు చదువుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు “అస్సలాముఅలైకుమ్ భాయియో సబ్ కో ఈద్ ముభారక్ అంటూ ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. ముస్లింలందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని, అన్ని వృత్తులకు సంబంధించిన వారు చేతినిండా పని ఉండి అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలని ఆ “అల్లాహ్” ని వేడుకుంటూ, నేను ముస్లిం కుటుంబంలో పుట్టకపోయినా ముస్లిం సోదర సోదరీమణులకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ఆనందపడుతున్నాను.

ఈరోజు గురజాల నియోజకవర్గంలో ముస్లిం సోదరులతో రంజాన్ ఈద్ నమాజ్ లో పాల్గొనటానికి ఇక్కడ నేను, గురజాలలో నా పెద్ద కొడుకు మహేష్, దాచేపల్లిలో నా చిన్న కొడుకు నిఖిల్ బాబు, మాచవరంలో మా అన్నయ్య గారి అబ్బాయి రమేష్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఈద్ నమాజ్ చదువుకొని రంజాన్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. మా కుటుంబం రాజకీయ జీవితంలో ఉన్నన్నాళ్లు, తర్వాత కూడా ముస్లిం సోదరులకు అండగా ఉంటామని అంటూ 1994 లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు పిడుగురాళ్ల పట్టణంలో చాలా పేదరికంలో ఉన్న ముస్లిం సోదరులు షాదీఖానా సౌకర్యం కూడా లేదని చెప్పి ఆ రోజు షాదీఖానా నిర్మించటం జరిగింది.

అదేవిధంగా ఆడపిల్లలకు మదర్సా లేదని చెప్తే అది కూడా పూర్తి చేపించి ముస్లిం సోదరీమణులు కోరిక కూడా తీర్చాము. 2014 లో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జానపాడు రోడ్డు లోని ఈద్గా కు వచ్చినప్పుడు ముస్లిం సోదరులు అందరూ రోడ్లమీద, బిల్డింగులు పైనా నమాజ్ చదువుకోటానికి ఇబ్బందులు పడుతుంటే చూసి అడిగితే ఊళ్లోని పెద్దలందరూ ఈద్గా సరిపోవట్లేదు సార్ ఎక్కడన్నా ఈద్గా స్థలం ఇప్పించమని అడిగితే చెరువు ప్రాంతంలో మూడు ఎకరాలు స్థలం శాంక్షన్ చేపించి ముస్లిం సోదరులకు నా వంతు సాయంగా ఏదైనా చేయాలనే కోరికతో ప్రభుత్వ సొమ్ము కాకుండా నా సొంత డబ్బులతో సుమారు రూ.50 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈద్గా కట్టించటం జరిగింది. ముస్లిం సోదరుల చిరకాల వాంఛ అయిన మక్కా యాత్ర హజ్ కు వెళ్లే భాగ్యంలో నేను కూడా పాలు పంచుకోవాలని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి 48 మందికి హజ్ కి పంపించడం జరిగింది. రేపు మరలా 2024లో మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడుగా ఎన్నికలలో గెలిచిన తర్వాత మరలా హజ్ కు వెళ్లే సోదరులకు తలా లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి పంపించే విధంగా నియోజవర్గ మేనిఫెస్టో సూపర్ సిక్స్ లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా దుల్హన్ పథకం ద్వారా ప్రభుత్వం చే లక్ష రూపాయలు ఇప్పించడంతోపాటు నేను కూడా 10 వేలు కలిపి ఇస్తాను. ఆనందోత్సవాలతో రంజాన్ నెలలో మసీదు మరమ్మత్తులు మరియు వైట్ వాష్ కొరకు ప్రభుత్వం ఇచ్చే నిధులే కాక నా సొంత నిధులను కూడా ఒక్కొక్క మసీదుకు పదివేల రూపాయలు చొప్పున నియోజకవర్గంలోని అన్ని మసీదులకు ఇవ్వబడుతుంది.

ఇదే కాక ఇక్కడే మరల మూడు ఎకరాల స్థలం ఇచ్చి ఎక్కడ లేని విధంగా దుబాయి మరియు సౌదీ లలో ఉన్న మసీదుల వలె రాజస్థాన్ మార్బుల్ తో ఒక మంచి మసీదును కట్టించాలని నా చిరకాల కోరిక. ఈ నా చిరకాల కోరికను మీ అందరి సహకారంతో ఆ అల్లా ఆశీస్సులతో తీరుస్తారని భావిస్తున్నాను. పార్టీలకతీతంగా ముస్లిం సోదరుల్లో ఒకడిగా ఉంటూ మీకు సేవ చేసుకుంటానని, మీరు కూడా నన్ను ఆదరించాలని కోరుతూ, 2019లో మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ముస్లిం సోదరులను అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి వడ్డీ లేని రుణాలు ఇస్తామని, దుల్హన్ 50,000 సరిపోట్లెదు లక్ష రూపాయలు ఇస్తానని అలవి కానీ ఆంక్షలు పెట్టి ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు. మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఏ ఒక్క ముస్లిం సోదరుడికి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదు అన్నారు. పేదలు ఆనందంగా పండగ జరుపుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వంలో రంజాన్ తోఫా పెడితే అది కూడా తీసేసి పేదల ఉసురు పోసుకున్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు అన్ని విధాలుగా అన్యాయం చేసి సంక్షేమ పరంగా ఆదుకోలేదు పైగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముస్లింలపై దాడులు చేస్తూ, మన నియోజకవర్గంలో కూడా పిన్నెల్లిలో ముస్లింలపై విచక్షణారతంగా దాడులు జరిపి,కొంత మందిని హత్య గావించి, తుమ్మలచెరువు షైదాను నడిరోడ్డుపై అల్లా అల్లా అంటున్న కనికరం లేకుండా కొట్టి, సుమారు నలుగురు ఆడపిల్లలపై అత్యాచారాలు జరిపి, వారి మైనింగ్ దాహానికి చిన్న పిల్లలను కూడా బలి తీసుకున్నారు. ఇప్పుడు మరలా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముస్లిం సోదరులను మరల మోసం చేయడానికి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పోతాయి అంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారు. విజ్ఞులైన ముస్లిం సోదరులందరూ దుష్ప్రచారాలు నమ్మకుండా మీ ఇంట్లో ఒక సోదరుడీలా నన్ను ఆదరించమని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో మౌలానా ముఫ్తి మహమూద్ నమాజ్ చదివించారు. దువా చేశారు. రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ బాబావలి, పల్నాడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు కార్ షైదా, షేక్ టిడిపి బాషా, ఫరీద్ మేస్త్రి, షేక్ ఖాదర్ వలీ, షేక్ ముజీబ్, సయ్యద్ ఇర్షాద్, జనసేన ఖాసీం సైదా, సలీం, డాక్టర్ వలీ, వాచర్ బుడే, అబ్దుల్ గనీ, షేక్ రజాక్, సయ్యద్ రజాక్, అబ్దుల్ గని, ఇమ్రాన్, పఠాన్ ఖాసీం, షేక్ ముస్తఫా, షేక్ నాగూరు, బాబు మేస్త్రి, షేక్ ఖాసీం, షేక్ కలాం, TV సుభాని,షేక్ హమీద్, గుత్తికొండ సుభాని, షేక్ జిలాని, షేక్ జమాల్, షేక్ షఫీ, సయ్యద్ మొహమ్మద్ అలీ, అబ్దుల్ రసూల్ లతో పాటు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొని ముస్లిం సోదరులతో పాటు ఈద్ నమాజ్ ఆచరించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. ముస్లిం సోదరులు అందరూ ఆనందోత్సాహాలతో ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుని ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.