Union Home Minister Amit Shah visited Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అమిత్‌షాకు శ్రీవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఈవో అందజేశారు.