TDP GUNNY TICKEY RALLY : గన్నికి టికెట్ ఇవ్వండి.. మేము గెలిపించుకుంటాం

రెండు దశాబ్దకాలంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా ఆదివారం తరలివెళ్లారు.
భీమడోలు, న్యూస్‌టుడే: రెండు దశాబ్దకాలంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా ఆదివారం తరలివెళ్లారు. దాదాపు 700ల కార్లలో గుండుగొలను కూడలి నుంచి ర్యాలీ ప్రారంభించారు. తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడైన గన్ని వీరాంజనేయులకు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తేనే ఓటు బ్యాంకు చీలకుండా ఉంటుందని పేర్కొంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బైఠాయించారు. గత ఎన్నికల్లో జనసేనకు 10,200 ఓట్లు వస్తే, తెదేపాకు 63 వేల ఓట్లు వచ్చాయన్నారు. గన్నికే టికెట్ కేటాయిస్తే తాము మరింత కష్టపడి పార్టీని గెలిపిస్తామంటూ పార్టీ కార్యాలయంలోని ఎన్‌టీఆర్ విగ్రహం పాదాల వద్ద వినతిపత్రం ఉంచారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి పాతర్ల రమేశ్, పొలిట్‌బ్యూరో సభ్యుడు షరీఫ్‌లకు వినతిపత్రాలు అందజేశారు.