TDP CHANDRABABU : Aspirants are excited about the 3rd list of TDP..ఆ 16 సీట్లలో పంట పండేదెవరికి.. టీడీపీ 3వ జాబితాపై ఆశావాహుల్లో ఉత్కంఠ..

పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు 128 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన టీడీపీ అధినేత.. త్వరలోనే మరో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే తమకే టికెట్ కేటాయించాలని చాలా చోట్ల నేతల అనుచరుల నిరసనలతో టీడీపీ బాస్ నిర్ణయంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పెండింగ్ స్థానాలపై ఫోకస్ పెట్టారు. పొత్తులో భాగంగా 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా.. ఇప్పటివరకు 128 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు చంద్రబాబు.
పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు 128 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన టీడీపీ అధినేత.. త్వరలోనే మరో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే తమకే టికెట్ కేటాయించాలని చాలా చోట్ల నేతల అనుచరుల నిరసనలతో టీడీపీ బాస్ నిర్ణయంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పెండింగ్ స్థానాలపై ఫోకస్ పెట్టారు. పొత్తులో భాగంగా 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా.. ఇప్పటివరకు 128 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు చంద్రబాబు. మరో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ 16 సెగ్మెంట్లలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నేతల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. కొవ్వూరు టికెట్ పెండింగ్‌లో పెట్టడంతో జవహర్ ఇంటి ముందు ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఫ్లెక్సీలు చించి నిరసన తెలిపారు. పెనమలూరులోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు TDP టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు బోడె అనుచరులు. ఒంటిపై టీడీపీ కార్యకర్త పెట్రోల్ పోసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
టీడీపీ రెండో జాబితాలోనూ కళా వెంకట్రావుకు చోటు దక్కకపోవడంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎచ్చెర్ల టీడీపీ కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. టికెట్ ప్రకటించడంలో జాప్యం జరిగితే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు సూచనతో రాబోయే ఎన్నికల్లో పోటీపై మిత్రులతో చర్చించారు గంటా శ్రీనివాసరావు. భీమిలి నుంచే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని మరోసారి చంద్రబాబును కోరాలని గంటా సన్నిహితులు సూచించారు. త్వరలోనే టీడీపీ అధినేత మరో లిస్ట్ విడుదల చేస్తారన్న సమాచారంతో అశావాహుల్లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇలా సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేసిన వారికి చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ స్థానాలు జనసేన, బీజేపీకి ఇచ్చేవి కావు. పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలకు 30 అసెంబ్లీ సీట్లు కేటాయించేశారు. అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన సీటు కూడా కన్ఫాం చేయడంలో బాబు ఎందుకు సంకోచిస్తున్నారు. ఓటమి భయమా.. అభ్యర్థి విషయంలో సందేహమా.. లేక మరేఇతర కారణాలైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ 16 స్థానాల్లో ఆశావహులకు చంద్రబాబు షాకిస్తారా.. లేక లైన్ క్లియర్ చేస్తారా అన్నది చూడాలి.