#ANDHRA ELECTIONS #Elections

SPs Palnadu, Prakasam and Nandyala were present before the CEO సీఈవో ఎదుట హాజరైన పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు

ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు గురువారం సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు.

అమరావతి: గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. దీంతో ముగ్గురు ఎస్పీలు గురువాం సీఈవో మీనా ఎదుట హాజరయ్యారు. అసలు ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? ఎవరు చేశారు? విచారణలో ఏం తేలింది? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు? అనే అంశాలపై వారి నుంచి వివరణ తీసుకున్నట్టు సమాచారం. ఎస్పీలు ఇచ్చిన సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఇప్పటికే ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

SPs Palnadu, Prakasam and Nandyala were present before the CEO సీఈవో ఎదుట హాజరైన పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు

ANDHRA POLITICAL : Pawan Kalyan met with

Leave a comment

Your email address will not be published. Required fields are marked *