#ANDHRA ELECTIONS #Elections

Sajjala Comments On EC&TDP :ఈసీ అంఫైర్‌లా వ్యవహరించలేదు: సజ్జల

తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.

‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

‘‘బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు.

Sajjala Comments On EC&TDP :ఈసీ అంఫైర్‌లా వ్యవహరించలేదు: సజ్జల

TDP Leaders Do Not Speak About Andhra

Leave a comment

Your email address will not be published. Required fields are marked *