Pattabhiram TDP :The video was edited as if Jagan was attacked : జగన్‌పై దాడి జరిగినట్టు వీడియో ఎడిట్ చేశారు : పట్టాభిరామ్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ …
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ (YCP)కి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉండే అంబులెన్స్ (Ambulance) ఏమైంది?.. సీఎం సభల్లోకి ఇతర మీడియాను (Media) ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు.

సీఎం జగన్‌పై దాడి జరిగినట్టు వీడియో ఎడిట్(Video editing) చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. దాడి జరిగిన పది నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకుని ధర్నా చేశారని, పది నిమిషాల్లోనే పోస్టర్లు, బ్యానర్లు ఎలా రెడీ అయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి డ్రామాలు అవసరమా? అని అన్నారు. జగన్ అద్భుతంగా నటిస్తారని.. ప్రతిసారి నటనను నిరూపించుకోవాల్సిన అసవరం లేదని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.