#ANDHRA ELECTIONS #Elections

Nara Lokesh had a bitter experience in Anantha Sankharavam! అనంత శంఖారావంలో.. నారా లోకేష్‌కు చేదు అనుభవం!

అనంతపురం: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబుకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే లోకేష్‌ పాల్గొంటున్న శంఖారావం సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. ఇక ఇప్పుడు పొత్తు పార్టీల కుమ్మలాటలు కూడా చినబాబు సమక్షంలోనే జరుగుతుండడం గమనార్హం. 

అనంతపురంలో నారా లోకేష్‌ శంఖారావం సభలు జరుగుతున్నాయి. అయితే అక్కడ టీడీపీ-జనసేన పొత్తు బెడిసి కొట్టింది. అనంత అర్బన్‌ టికెట్‌ తమకేనంటూ టీడీపీ-జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని ఘర్షణ వాతావరణం సృష్టించారు. లోకేష్‌ స్టేజ్‌ మీద మాట్లాడుతున్న టైంలోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది.  

అనంత అర్బన్‌ టికెట్‌కు టీడీపీ తరఫున ప్రభాకర్‌ చౌదరి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే జనసేన తరఫున టీసీ వరుణ్‌ ఆశిస్తున్నారు. కలిసి పని చేయాలని ఇరు పార్టీల నేతలు పదే పదే చెబుతున్నా.. ఆయా వర్గాల నేతలు, కార్యకర్తలు ససేమిరా చెబుతుండడం విశేషం. 

Nara Lokesh had a bitter experience in Anantha Sankharavam! అనంత శంఖారావంలో.. నారా లోకేష్‌కు చేదు అనుభవం!

If a defamation suit is filed against

Leave a comment

Your email address will not be published. Required fields are marked *