#ANDHRA ELECTIONS #Elections

Modi tour fix in AP.. Modi, Chandrababu, Pawan on the one stage

ఏపీలో ఎన్నికలు సమపీస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు నిర్వహించి దూకుడు మీద ఉన్నాయి. ఇక బీజేపీ పలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పీఎం మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు.

ఏపీలో ఎన్నికలు సమపీస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు నిర్వహించి దూకుడు మీద ఉన్నాయి. ఇక బీజేపీ పలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పీఎం మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 15న విశాఖలో ప్రధాని రోడ్‌ షో ఉండగా, 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగే టీడీపీ-జేఎస్-బీజేపీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో సమావేశమైనప్పుడు టిడి-జెఎస్ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరయ్యే ఏర్పాటు చేయాలని కేంద్ర బిజెపి నాయకులను కోరారు. ఇదిలావుండగా, బహిరంగ సభ నిర్వహణకు పలు కమిటీలను చంద్రబాబు ప్రకటించారు.

తొలుత టీడీపీ, జేఎస్ వేర్వేరుగా బహిరంగ సభ నిర్వహించాలని భావించాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు ముందు బహిరంగ సభను నిర్వహించనున్నాయి. కొన్ని విభజన హామీలను నెరవేర్చడం వంటి బహిరంగ సభలో ప్రధాని మోడీ కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉందని టిడిపి, బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఇది రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య కొత్త పొత్తును సమర్థిస్తుందని వారు భావిస్తున్నారు. అయితే 2014లో ఎన్నికల ప్రచారం తర్వాత.. చాలా ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రానుండటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక ఏపీలో కాంగ్రెస్ ఎప్పటిలాగే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటుండగా, అధికార పార్టీ వైసీపీ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగుతోంది. ఒక్క ఛాన్స్ ఫ్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నా కల.. నా లక్ష్యం అంటూ మరోసారి అధికారం ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు తేల్చి చెప్పారు.

Modi tour fix in AP.. Modi, Chandrababu, Pawan on the one stage

Andhra Pradesh : New alliance – old

Leave a comment

Your email address will not be published. Required fields are marked *