MLA PINNELLI RAMAKRISHNA REDDY BAIL PETITION: ఎమ్మెల్యే పిన్నెళ్లి బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు

ఈవీఎంని ధ్వంసం చేసి పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6న ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈవీఎంని ధ్వంసం చేసి పరారీలో ఉన్న వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6న ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌తో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకో వద్దని కోర్టు స్పష్టం చేసింది. కాగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్ల అన్నింటి విషయంలో ఇదే విధానాన్ని పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే జూన్ 6 వరకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని క్లారిటీ ఇచ్చింది.

అస్మిత్ రెడ్డి, పెద్దారెడ్డిలకూ ఊరట..
తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి, వైసీపీ పెద్దారెడ్డిలకు కూడా ఏపీ హైకోర్ట్‌లో ఊరట దక్కింది. జూన్ 6 వరకు అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సమయంలో వీరిద్దరూ తాడిపత్రికి వెళ్లకూడదని, ఎటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడకుండా ఉండాలని ఏపీ హైకోర్ట్ షరతు విధించింది. వీరి కదలికలపై నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు నలుగురికి మించి తిరగకూడని క్లారిటీ ఇచ్చింది. అయితే జూన్ 6 వరకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని హైకోర్ట్ తెలిపింది. జూన్ 6 వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చింది.