#ANDHRA ELECTIONS #Elections

In this election, we will give Good lesson to Jagan : Mandakrishna Madiga ఈ ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. 

ఒంగోలు: రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెప్తామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేడ్కర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల సంక్షేమం పట్ల సీఎంకు చిత్తశుద్ధి లేదని, ఇటీవల ప్రకటించిన పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. 

‘‘జగన్‌ ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దయ్యాయి. గతంలో ఉన్న విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు తీసేసి జగన్‌ పేరు పెట్టడమేంటి? గత ప్రభుత్వం మాదిగ కులానికి ప్రాధాన్యమిచ్చింది. నరేంద్ర మోదీ కూడా మమ్మల్ని గుర్తించారు. అందుకే ఈ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతు ఇస్తాం. త్వరలో కూటమి అగ్ర నేతలను కలిసి మాట్లాడతా’’అని మందకృష్ణ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *