#ANDHRA ELECTIONS #Elections

Election Commission : Minister Dahisetty Raja vehicles seized మంత్రి దాడిశెట్టి రాజా వాహనాలను స్వాధీనం చేసుకున్న ఎన్నికల సిబ్బంది

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు.

గాజువాక, కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. వైకాపా జెండా రంగులు, సిద్ధం స్టిక్కర్లు ఉన్న రెండు ప్రభుత్వ వాహనాలు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరాయన్న సమాచారంతో విశాఖలోని అగనంపూడి టోలు గేటు సమీపంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌ఛార్జి అధికారి రేవతి, పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. మంత్రి రాజాను విమానాశ్రయంలో దించి గన్‌మెన్లు, మరికొందరు కార్యకర్తలు ఆ వాహనాలతో తిరిగి తుని వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, అందులో ప్రయాణిస్తున్న వారిని దువ్వాడ పోలీసులకు అప్పగించారు.

Election Commission : Minister Dahisetty Raja vehicles seized మంత్రి దాడిశెట్టి రాజా వాహనాలను స్వాధీనం చేసుకున్న ఎన్నికల సిబ్బంది

Kavitha : Can’t grant bail.. Go to

Leave a comment

Your email address will not be published. Required fields are marked *