#ANDHRA ELECTIONS #Elections

Congress list on 25th of this month.. Sharmila as Kadapa MP candidate..?ఈ నెల 25న కాంగ్రెస్‌ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్‌ కసరత్తును ముమ్మరం చేసింది.

అమరావతి :  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్‌ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్ఠానం.. ఈ నెల 25న జాబితా విడుదల చేయనుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. కడప లోక్‌సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కడప నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *