Chandrababu: Pensions should be given immediately వెంటనే పింఛన్లు ఇవ్వాలి..సీఈవో, సీఎస్‌కు చంద్రబాబు ఫోన్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు.
అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలూ విధించలేదని.. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే అందించాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేసవి ఎండల్లో వృద్ధులు ఇబ్బందిపడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికుందని చెప్పారు.