Chandra Babu : A missed threat to Chandrababu : ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుకు తప్పిన ముప్పు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది..

కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు పెను ముప్పు తప్పింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు.
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుకుపెను ముప్పు తప్పింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఎమ్మిగనూరు తెరుబజారులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబును ముస్లిం నాయకులు సన్మానిస్తుండగా వాహనం చివర్లో నిలబడిన ఆయన, కింద పడబోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెనుక నుంచి చంద్రబాబు కింద పడకుండా పట్టుకున్నారు. ప్రచార వాహనానికి ఉన్న సపోర్ట్ హ్యాండిల్‌ను పట్టుకోవడంతో చంద్రబాబు నిలబడగలిగారు.