#ANDHRA ELECTIONS #Elections

Balakrishna Public Meeting At Yemmiganur: జగన్‌కు ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే..

సీఎం జగన్‌ (CM Jagan)కు ఏపీ ఎన్నికల్లో ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లేనని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. జనం అన్ని వదులుకొని రాష్ట్రం విడిచి పెట్టి పోవాల్సిందేనని అన్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మంగళవారం నాడు బాలకృష్ణ రోడ్డు షో నిర్వహించారు.

కర్నూలు: సీఎం జగన్‌ కు ఏపీ ఎన్నికల్లో ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లేనని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. జనం అన్ని వదులుకొని రాష్ట్రం విడిచి పెట్టి పోవాల్సిందేనని అన్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మంగళవారం నాడు బాలకృష్ణ రోడ్డు షో నిర్వహించారు. శివసర్కిల్‌లో బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

లెజెండ్ సినిమా 400 రోజులు ప్రదర్శించి దేశ చరిత్రలో ఎమ్మిగనూరు నిలిచిపోయిందని కొనియాడారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా తామేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమకు నీళ్లిచ్చిన అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెలిపారు. ప్రపంచ పటంలో ఏపీ తుడిచి పెట్టుకు పోయే పరిస్థితికి తెచ్చారని విరుచుకుపడ్డారు. జగన్ అరాచకాలు ఇక చెల్లవు… కాస్కో జగన్ అని బాలకృష్ణ సవాల్ విసిరారు. జగన్ నవరత్నాల పేరుతో ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.

ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక పేదరాలని జగన్ అంటున్నారని చెప్పారు. బుట్టా రేణుక రూ. 360 కోట్లు అప్పులు చెల్లించాలని ఎల్‌ఐసీ ఫైనాన్స్ సంస్థ ప్రకటన ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. పేదరాలు డబ్బుల సంచులతో వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఎద్దేవా చేశారు. జగన్‌ను, బుట్టా రేణుకను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే వాళ్లు కోట్లకు పడగలెత్తుతారు. జనం బికారీలుగా మారుతారని ఆక్షేపించారు. ఎన్డీయే కూటమిని ఎదుర్కొనే సత్తా వైసీపీకి లేదని ఉద్ఘాటించారు.

ఎమ్మిగనూరులో చేనేత కార్మికుడు 2 సెంట్ల భూమి కోసం ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ బాలిక హజీరాను వైసీపీ మూకలు అత్యాచారం చేసి చంపేశారని ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరులో టీడీపీ హయాంలో టెక్స్‌టైల్ పార్క్‌కి 100 ఎకరాలు కేటాయిస్తే.. వైసీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని దుయ్యబట్టారు. పసుపు జెండా కదిలితే తాడేపల్లిలో జగన్ గుండెల్లో అదురుతోందన్నారు.ఓటుతో జగన్‌కు అపజయం రుచి చూపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *