#ANDHRA ELECTIONS #Elections

APPC Chief YS Sharmila is contesting as Kadapa MP కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 

కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ప్రచారం కోసం బస్సు యాత్రను ఎంచుకున్నారు కడపలో ఉన్న మొత్తం ఏడు నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా బస్సు యాత్ర షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. ఏఫ్రిల్ 5వ తేదీ నుంచి బస్సు యాత్రను ప్రారంభించి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాన్ని చుట్టేసే విధంగా షెడ్యూల్‌ను రూపొందించారు కాంగ్రెస్ నేతలు.

కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ప్రచారం కోసం బస్సు యాత్రను ఎంచుకున్నారు కడపలో ఉన్న మొత్తం ఏడు నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా బస్సు యాత్ర షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. ఏఫ్రిల్ 5వ తేదీ నుంచి బస్సు యాత్రను ప్రారంభించి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాన్ని చుట్టేసే విధంగా షెడ్యూల్‌ను రూపొందించారు కాంగ్రెస్ నేతలు.

కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఏఫ్రిల్ 5వ తేదీ నుంచి బస్సు యాత్రను చేపట్టనున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ఈ బస్సు యాత్ర సాగనుంది. ఐదోవ తేదీన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన మండలంలో బస్సు యాత్రను మొదలై, ప్రొద్దుటూరులో ముగిసే విధంగా బస్సు యాత్ర షెడ్యూల్‌ను రూపొందించారు. ఐదోవ తేదీ నుంచి 12వ తారీకు వరకు మొత్తం ఎనిమిది రోజులపాటు ఈ బస్సు యాత్ర సాగనుంది.

బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన మండలంలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర 12వ తేదీ రాజుపాలెం మండలంలో ముగుస్తుంది. తొలిరోజు కలసపాడు, పోరుమామిళ్ల, కోడూరు, గోపవరం మండలాలలో షర్మిల బస్సు యాత్ర ఉంటుంది. అనంతరం ఆరో తేదీ బద్వేలు, అట్లూరు ప్రాంతాలమీదుగా కడప చేరుకుంటారు షర్మిల. ఏడో తేదీ దువ్వూరు, చాపాడు, కాజీపేట ఎస్, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం మీది గుండా బస్సు యాత్ర సాగుతుంది. 8వ తేదీ కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లి మండలాలలో బస్సు యాత్ర ఉంటుంది. పదవ తేదీ పులివెందుల నియోజకవర్గం లోని చక్రాయపేట, వేంపల్లి, వేముల పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాలలో బస్సుయాత్ర చేయనున్నారు షర్మిల.

ఏఫ్రిల్ 11వ తేదీ తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరంలలో బస్సుయాత్ర చేస్తారు. చివరి రోజు అయిన 12వ తేదీ జమ్మలమడుగులో ప్రారంభమై పెద్దముడియం మీది గుండా ప్రొద్దుటూరు చేరుకుని రాజుపాలెంలో బస్సు యాత్రను ముగించనున్నారు షర్మిల. ఎనిమిది రోజులపాటు ఏడు నియోజకవర్గాలలో తిరుగుతూ తన కడప పార్లమెంటు సంబంధించిన అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా బస్సు యాత్రను రూపొందించారు కాంగ్రెస్ నేతలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *