#ANDHRA ELECTIONS #Elections

AP Politics: Tickets fighting between alliance leaders in Srikalahasti..శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య టిక్కెట్ లొల్లి.. 

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య టిక్కెట్ లొల్లి ఏమాత్రం సద్దుమణగడం లేదు. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్‎పై కూటమి పార్టీల మధ్య పేచీ పరాకాష్టకు చేరింది. మూడు పార్టీల్లోనూ కుంపటి రగులుతోంది. ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్‌ బొజ్జల సుధీర్‌రెడ్డి పేరును చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య టిక్కెట్ లొల్లి ఏమాత్రం సద్దుమణగడం లేదు. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్‎పై కూటమి పార్టీల మధ్య పేచీ పరాకాష్టకు చేరింది. మూడు పార్టీల్లోనూ కుంపటి రగులుతోంది. ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్‌ బొజ్జల సుధీర్‌రెడ్డి పేరును చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ.. టికెట్ ఆశిస్తున్న కొందరు టీడీపీ నేతలు, బీజేపీ, జనసేన ఇన్‌చార్జ్‌ల ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బొజ్జల సుధీర్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించని మిత్రపక్షాలు టిక్కెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఈ క్రమంలోనే.. బొజ్జల సుధీర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే SCV నాయుడుతో పాటు బీజేపీ, జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. జనసేన ఇన్‌చార్జ్‌ కోట వినూతకు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ క్యాడర్ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా.. టీడీపీ, జనసేన, బీజేపీలోని అసమ్మతి నేతలు శ్రీకాళహస్తిలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌కు టీడీపీ, జనసేన, బీజేపీలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా.. బొజ్జల సుధీర్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. 35 ఏళ్లుగా బొజ్జల కుటుంబానికి టీడీపీ టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులపై సర్వే నిర్వహించి టికెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు SCV నాయుడు. టీడీపీ నుంచి తనకు.. లేకుంటే.. జనసేన నుంచి కోట వినూత, బీజేపీ నుంచి కోలా ఆనంద్‌కు కానీ టిక్కెట్‌ ఇవ్వాలని.. తమ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ.. కూటమి నుంచి బొజ్జల సుధీర్‌నే టీడీపీ అభ్యర్థిగా కొనసాగిస్తే పనిచేసేదిలేదని తెగేసి చెప్పారు శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ కోట వినూత. మొత్తంగా.. శ్రీకాళహస్తి టీడీపీ క్యాండేట్‌గా బొజ్జల సుధీర్‌రెడ్డిని ప్రకటించిప్పటి నుంచి కూటమిలో టిక్కెట్‌ లొల్లి కొనసాగుతూనే ఉంది. బొజ్జల సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడంతో శ్రీకాళహస్తి కూటమి రాజకీయం మరింత ఆసక్తిగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *