AP Politics: లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌పై సీఈసీ టీడీపీ లేఖ

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ వస్తున్న వార్త రాష్ట్రంలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. లోకేష్ ఫోన్‌ను గుర్తు తెలియని సాఫ్ట్ వేర్‌లతో ఫోన్‌ను హ్యాకింగ్, ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందంటూ యువనేతకు ఆపిల్ సంస్థ ఈమెయిల్ పంపింది. ఈ వ్యవహారాన్ని టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంధ్ర కుమార్ లేఖ రాశారు.
అమరావతి, ఏప్రిల్ 12: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ వస్తున్న వార్త రాష్ట్రంలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. లోకేష్ ఫోన్‌ను గుర్తు తెలియని సాఫ్ట్ వేర్‌లతో ఫోన్‌ను హ్యాకింగ్, ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందంటూ యువనేతకు ఆపిల్ సంస్థ ఈమెయిల్ పంపింది. ఈ వ్యవహారాన్ని టీడీపీ (TDP) కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) దృష్టికి తీసుకెళ్లింది. లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంధ్ర కుమార్ (TDP Former Rajya Sabha Member Kanakamedala Ravindra Kumar) లేఖ రాశారు. గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్‌వేర్ సాయంతో లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఐపోన్ సందేశాలు వచ్చాయన్నారు. ఇలాంటి సందేశాలే లోకేష్‌కు 2024 మార్చిలో కూడా వచ్చాయన్నారు.

రాష్ట్ర డీజీపీ రాజేంధ్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనేక మార్లు ఈసీ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా ఇంఛార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమన్నారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. సాధారణ ఎన్నికల నేపధ్యంలో అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుని.. వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించగలరంటూ కనకమేడల రవీంద్ర కుమార్ లేఖలో విన్నవించారు.