AP Elections YS. Sharmila : మదనపల్లి చుట్టూ ఔటర్ ఏది..? : షర్మిల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లెలో పర్యటించిన షర్మిల స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీ – నీవా కట్టాలని అనుకున్నారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్న సమయంలో 90 శాతం పనులు జరిగాయని వివరించారు.

అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై (Jagan) ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లెలో పర్యటించిన షర్మిల స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీ – నీవా కట్టాలని అనుకున్నారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్న సమయంలో 90 శాతం పనులు జరిగాయని వివరించారు. హంద్రీ – నీవా పూర్తయి ఉంటే మదనపల్లి నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు వచ్చేదని తెలిపారు.
సీఎం జగన్పై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మదనపల్లి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు అన్నారు. ఫ్యాన్ గాలికి ఔటర్ కొట్టుకు పోయిందా..? అని ధ్వజమెత్తారు. సమ్మర్ ట్యాంక్ కడతాం అన్నారు.. ? ఆ మాట కూడా మరిచారు. మదనపల్లి టమాటాకి ఫెమస్. ధర హెచ్చు తగ్గులతో ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. 3 వేల కోట్లతో చెప్పిన ప్రత్యేక ధరల స్థిరీకరణ ఏమయ్యింది ? టమాటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏమయ్యాయి ? చేనేతల కోసం క్లస్టర్ ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఒక్క క్లస్టర్ కట్టారా ? మదనపల్లి చీరలకు బ్రాండ్ కల్పిస్తాం అన్నారు…ఆ బ్రాండ్ ఎక్కడ ? నియోజక వర్గంలో ఒక్క హామీ అమలు కాలేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు దిక్కులేదు అని’ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.