#ANDHRA ELECTIONS #Elections

AP Congress:  Tickets Issue In Congress party Andhra : ఏపీ కాంగ్రెస్‌లోనూ టికెట్లు ఇవ్వలేదంటూ రచ్చ రచ్చ ..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ టికెట్ల రగడ మొదలైంది. కష్టపడి పనిచేసిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు గొడవ పడటం హాట్ టాపిక్‌గా మారింది. అనపర్తి, రాజానగరం ఆశావహులు గిడుగు రుద్రరాజు ఎదుటే ఆగ్రహం వ్యక్తంచేశారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇప్పటికే టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌లో ఉంది. టికెట్లు దక్కని పలువురు నేతలు ఆందోళనలు, ఆసంతృప్తి వ్యక్తం చేయడం లాంటివి పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ ఇదే సీన్ రిపీటైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇండియా కూటమి నాయకులతో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చిన అనపర్తి, రాజానగరం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన తమకు టిక్కెట్లు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. గిడుగు రుద్రరాజు సమక్షంలోనే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అయితే గిడుగు రుద్రరాజు మాత్రం అందరినీ కలుపుకుని పోతామనీ.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం కోసం పలువురు నేతలనూ తీసుకొస్తామని పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్ ఆశయాలకు ఏపీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే వారసులన్నారు గిడుగు రుద్రరాజు. విభజన హామీలు అమలు చేయాలన్నా.. వైఎస్‌ఆర్ పాలన మళ్లీ తీసుకురావాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

AP Congress:  Tickets Issue In Congress party Andhra : ఏపీ కాంగ్రెస్‌లోనూ టికెట్లు ఇవ్వలేదంటూ రచ్చ రచ్చ ..

Nara Lokesh’s tweet on the burning of

AP Congress:  Tickets Issue In Congress party Andhra : ఏపీ కాంగ్రెస్‌లోనూ టికెట్లు ఇవ్వలేదంటూ రచ్చ రచ్చ ..

Minister Seethakka Fire On Brs Party :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *