Andhra Pradesh : New alliance – old ruckus.. politics heating up during elections..Andhra Pradesh :

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు.. సస్పెన్స్‌కు తెరపడింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. ఎన్డీయేలోకి టీడీపీ రీ-ఎంట్రీ ఖాయమైంది. అయితే, ఏపీలో పొత్తుల తర్వాత మూడు పార్టీల్లో మూడు రకాల రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కలహాలు లేకుండా టార్గెట్ 160 దిశగా పనిచేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేస్తూ.. టికెట్ దక్కని నేతలను బుజ్జగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు.. సస్పెన్స్‌కు తెరపడింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. ఎన్డీయేలోకి టీడీపీ రీ-ఎంట్రీ ఖాయమైంది. అయితే, ఏపీలో పొత్తుల తర్వాత మూడు పార్టీల్లో మూడు రకాల రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కలహాలు లేకుండా టార్గెట్ 160 దిశగా పనిచేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేస్తూ.. టికెట్ దక్కని నేతలను బుజ్జగిస్తున్నారు. తమపార్టీకి సీట్లు తగ్గడంపై బాధకలిగిందని జనసేన నేతలు అంటుంటే.. సొంత ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన వారికి ప్రాయర్టీ ఇస్తున్నారంటూ బీజేపీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. అంతేకాకుండా.. వలస నేతలు వర్సెస్ సీనియర్ లీడర్లుగా పరిస్థితి మారిపోయింది. పార్టీ ఆఫీసు గడప తొక్కని వాళ్లు సీటుకోసం పట్టుబడుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన వారికి ప్రాయర్టీ ఇస్తున్నారంటూ కన్నెర్ర చేస్తున్నారు.