#ANDHRA ELECTIONS #Elections

Andhra Pardesh:  Everything is ready for public meeting ప్రజాగళం సభకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.

పల్నాడు జిల్లాలో ప్రజా గళం సభకు సర్వం సిద్ధమైంది. బొప్పిడి సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రధాని మోదీ హాజరవుతున్న సభను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఈసభ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎన్డీఏ కూటమి ఎలాంటి భరోసా ఇస్తారనే ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి మొదటి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. టిడిపి, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు ఖరారైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో 300 ఎకరాల్లో సభాప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రజా గళం సభకు ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం 4గంటలకు హాజరవుతారు. ప్రధాని మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కలిసి హాజరవుతున్నా తొలి బహిరంగ సభ.. బొప్పూడి దగ్గర సభా ప్రాంగణాన్ని పరిశీలించారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.

300 ఎకరాల సభాప్రాంగణంలో 225 ఎకరాలు వాహనాల పార్కింగ్, ఏడు హెలిప్యాడ్‌లకు కేటాయించారు. 75 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, వీఐపీ, ప్రజలకు వేర్వేరుగా బారికేడ్లతో గ్యాలరీలు ఏర్పాటుచేసారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. కూటమి సభ నిర్వహిస్తున్న బహిరంగసభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు. ఎస్పీజీ సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించటంతో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా వేశారు. ప్రధాని మోదీతోపాటు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కళ్యాణ్‌ హాజరవుతున్నందున 7 హెలిప్యాడ్‌లు నిర్మించారు. ప్రజాగళం సభ విజయవంతం అవుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రజాగళం సభ కూటమి విజయానికి తొలి అడుగన్నారు పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిపోవాలని చెప్పారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రజాగళం సభకు గ్రామాలకు గ్రామాలు, పల్లెలకు పల్లెల ప్రజలు రావాడానికి ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు అచ్చెన్నాయుడు.

బొప్పూడి సభ ద్వారా కూటమి ఎన్నికల ప్రణాళికను ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఈసభ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎన్డీఏ కూటమి ఎలాంటి భరోసా ఇస్తారనే ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠత నెలకొంది. 2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడే ముగ్గురు ఒకే వేదికను పంచుకుంటున్నారు. ప్రజాగళం సభను విజయవంతం చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భారీ ఎత్తున జనసమీకణ చేస్తున్నారు.

Andhra Pardesh:  Everything is ready for public meeting ప్రజాగళం సభకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.

Kavitha to ED custody for seven days

Andhra Pardesh:  Everything is ready for public meeting ప్రజాగళం సభకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.

vishakha : Nyaya Sadana Sadassu CM Revath

Leave a comment

Your email address will not be published. Required fields are marked *