ANDHRA ELECTION: Police action plan .. Orders to surrender weapons..ఫ్యాక్షన్ ఘటనల దృష్ట్యా పోలీసుల యాక్షన్ ప్లాన్.. వెపన్స్ సరెండర్ చేయాలంటూ ఆదేశాలు..

సమయం లేదు మిత్రమా.. తుపాకులు సమర్పించండి అంటున్నారు ఏపీ పోలీసులు. వేర్వేరు కారణాలతో లైసెన్స్‌డ్ వెపన్స్ తీసుకున్న వాళ్లంతా తిరిగి ఇచ్చేయాలంటున్నారు. లేదంటే యాక్షన్ మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోలీస్ ఆదేశాలతో జిల్లాలవారీగా గన్ డౌన్ ఊపందుకుంది. ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలు, నేతలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.
సమయం లేదు మిత్రమా.. తుపాకులు సమర్పించండి అంటున్నారు ఏపీ పోలీసులు. వేర్వేరు కారణాలతో లైసెన్స్‌డ్ వెపన్స్ తీసుకున్న వాళ్లంతా తిరిగి ఇచ్చేయాలంటున్నారు. లేదంటే యాక్షన్ మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోలీస్ ఆదేశాలతో జిల్లాలవారీగా గన్ డౌన్ ఊపందుకుంది. ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలు, నేతలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. బిజీ షెడ్యూల్‌తో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నారు. నేతల ప్లాన్స్ ఇలా ఉంటే.. ఎన్నికల క్రమంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ రక్షణ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్‌తో ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బులు, బంగారం, ఇతర గిఫ్ట్స్‌ల రవాణాను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా లైసెన్స్‌డ్ గన్స్‌ను సరెండర్ చేయాలని సదరు వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు పోలీసులు.
ఆంధ్రప్రదేశ్‌లో 9వేలకు పైగా లైసెన్స్‌డ్ గన్స్ ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కోడ్‌తో జిల్లాలవారీగా గన్‌లు డిపాజిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖలో 728మంది దగ్గర లైసెన్స్ తుపాకులు ఉన్నాయి. వాటన్నింటిని హ్యాండోవర్ చేసుకున్నామన్నారు పోలీసులు. తిరుపతి జిల్లాలో 464 గన్స్‌కి 404 మాత్రమే డిపాజిట్ అయ్యాయి. ఈ జిల్లాలో 17మంది బ్యాంక్ సెక్యూరిటీకి కలెక్టర్, ఎస్పీలు మినహాయింపు ఇచ్చారు. మిగతా 43 వెపన్స్ సరెండర్ కావాల్సి ఉంది. చిత్తూరుజిల్లాలో 696 లైసెన్స్‌డ్ గన్స్‌కి మొత్తం డిపాజిట్ అయ్యాయి. కడపజిల్లాలో 774 వెపన్స్‌కి 683 డిపాజిట్ అయ్యాయి. 73 మినహా మిగతావన్నీ తిరిగి వచ్చేశాయన్నారు అధికారులు. అన్నమయ్య జిల్లాలో 796కి 774 గన్‌లు డిపాజిట్ అయ్యాయి. ఈ జిల్లాలో 32 లైసెన్స్ తుపాకులు బ్యాంక్ సిబ్బంది దగ్గర ఉన్నాయి.
జాతీయ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. నోటిషికేషన్ వెలువడిన వెంటనే.. యజమానులు తమ లైసెన్స్‌డ్ తుపాకులు లోకల్ పీఎస్‌లో అప్పగించాలి. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకి లైసెన్స్ ఉన్న వారి జాబితా ఇప్పటికే సిద్ధం చేసిన పోలీసులు.. వాళ్లందరికి మెసేజ్‌లు పంపించారు. నోటిఫికేషన్ వెలువడిన పదిరోజుల్లోగా తమ దగ్గరున్న ఆయుధాలను సమర్పించాలని పేర్కొన్నారు. సరెండర్ చేసిన వెపన్స్‌ని ఎన్నికలు అయిపోయాక లెటర్ చూపించి వాటిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లైసెన్స్ తీసుకున్న వారిలో చాలామంది ఇంకా తమ గన్‌లను డిపాజిట్ చేయలేదు. వీలైనంత త్వరగా వాటిని సబ్‌మిట్ చేయాలంటున్నారు పోలీసులు. లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.