#ANDHRA ELECTIONS #Elections

ANDHRA ELECTION : If you post anything Wrong on social media, you will go to jail.సోషల్ మీడియాలో ఏవి పడితే అవి పోస్ట్ చేస్తే జైలుకే.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటువంటి అసాంఘిక శక్తులకు తావీయకుండా ముందు నుంచి ప్రణాళికా బద్ధంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పట్టణ ప్రాంతాలతో పాటు చిన్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఓటు అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఏలూరు, మార్చి 24: రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటువంటి అసాంఘిక శక్తులకు తావీయకుండా ముందు నుంచి ప్రణాళికా బద్ధంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పట్టణ ప్రాంతాలతో పాటు చిన్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఓటు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఏటువంటి తప్పుడు సమాచారం రాకుండా ఉండేందుకు నిఘా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సోషల్ మీడియా ఫిర్యాదుల కోసం 9030004969 వాట్సాప్ నెంబర్ వున్న వాల్ పోస్టర్‎ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా తప్పుడు సమాచారం చేరవేస్తే వాల్ పోస్టర్‎లో ఉన్న నెంబర్‎కు సమాచారాన్ని అందజేయాలని పేర్కొన్నారు. అలా సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అంతేకాక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పాటించవలసిన నియమ నిబంధనల గురించి ఆయా మాధ్యమాల నిర్వాహకులకు అడ్మిన్‎లకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీచేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్నాయన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న క్రమంలో సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఏలూరు జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అలాగే ట్రోలింగ్, ఆన్‌లైన్‌ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా వుంటుందని, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఆయా వాట్సప్, ఫేస్‌ బుక్‌ గ్రూప్స్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆ వివాదస్పద పోస్టింగ్ సంబంధించి ఆడ్మిన్ ఏం చర్యలు తీసుకోకుంటే.. అడ్మిన్లపై పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అడ్మిన్ వివాదస్పద పోస్టు చేస్తే ఐటీ చట్టం. ఐపీసీ సెక్షన్ 153(ఎ) కింద శిక్ష విధిస్తారు. 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంటుందని, ఆన్ లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్లు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై పలు ఈ క్రింది సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.

67 ఐటి యాక్ట్ ఆన్ లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్ లకు పాల్పడితే ఈ సెక్షన్ కింద గరిష్టంగా 5 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు జరిమానా రెండు విదస్తారని, ఐ.పీ.సీ సెక్షన్ 354 ఉద్దేశపూర్వకంగా ఒక మహిళను లక్ష్యంగా చేసుకొని వేధిస్తే నేరుగా గాని, సోషల్ మీడియా ద్వారా గాని అదేపనిగా సంప్రదించడం, వెంట పడి దూషించడం, అవమానించడం, వేధించడం వంటివి తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందన్నారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 5 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా ఉంటుందని తెలిపారు. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా రెండు వర్గాల మధ్య విభేదాలకు దారితీసే, విద్వేషాలు పెంచే సమాచారాన్ని వైరల్ చేస్తే వారి వివరాలను వాట్సాప్ నంబర్ 9030004969 ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, ఫిర్యాదు చేసిన వరి వివరాలు గోప్యంగా ఉంటుతామన్నారు. ప్రతీ ఒక్కరూ ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఎన్నికల పరిధిలోనే ఉంటారని ఆమె తెలిపారు. ఎవరైనా సరే ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చ‌ర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు, ప్రదర్శనలకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపా రాణి, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సైబర్ సెల్ ఎస్ఐ మధు వెంకటరాజ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ANDHRA ELECTION : If you post anything Wrong on social media, you will go to jail.సోషల్ మీడియాలో ఏవి పడితే అవి పోస్ట్ చేస్తే జైలుకే.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

Russia :  Terror Attack on Krakow city

Leave a comment

Your email address will not be published. Required fields are marked *