ANDHRA CONGRESS PARTY : A sitting MLA who joined the Congress వైసీపీకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలతో కూడిన శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో పార్టీల్లో జంపింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన పలువరు సిట్టింగ్‌లు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీకి షాక్‌మీద షాక్ తగులుతుంది. వైసీపీని ఆపార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వీడుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం ఎలిజా చింతలపూడి ఎమ్మెల్యేగా ఉండగా.. ఆయనను కాదని.. జగన్ కుంభం విజయరాజకు టికెట్ ఇచ్చారు. దీంతో చిన్నబుచ్చుకున్న ఎలిజా.. వైసీపీ వీడి.. కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు.