ANDHRA BJP : tickets.. Confusion in AP BJP టికెట్ల లొల్లి.. ఏపీ బీజేపీలో అయోమయం

సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. ఆ పార్టీ సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై బీజేపీలో అయోమయం నెలకొంది. బీజేపీకి కేటాయించిన కొన్ని సీట్లలో మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఓడిపోయే సీట్లని బీజేపీకి ఇచ్చారంటూ ఇప్పటికే అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
గెలిచే సీట్లే ఇవ్వాలంటూ సీనియర్లు పట్టుబడుతున్నారు. సీనియర్ల ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో రెండు రోజుల క్రితం కోర్ కమిటీ చర్చించింది. బీజేపీ గెలిచే సీట్లు ఇవ్వాలంటూ కొన్ని స్ధానాలలో బీజేపీ మార్పులు కోరింది.
బీజేపీ కోరిన సీట్ల కోసం హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మరోసారి సమావేశమయ్యారు. బీజేపీ తాజా ప్రతిపాదనలు, సీట్ల మార్పులపై చర్చించారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఏపీ అభ్యర్ధులపై చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని స్ధానాలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.