#ANDHRA ELECTIONS #Elections

విశాఖ వీధుల్లో కేంద్ర బలగాలు, పోలీస్ ఫ్లాగ్ మార్చ్.. ఎందుకో తెలుసా..!

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశాఖ నగరంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించ్చారు. రానున్న ఎన్నికల కోసం విశాఖలో పోలీసులు, కేంద్ర బలగాలు, సన్నద్ధమవుతున్నారు.

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాకా బందీ నిర్వహించిన పోలీసులు.. కీలక పాయింట్లపై నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

అడిషనల్ డిజిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ రవి శంకర్ అయ్యనార్ ఆదేశాలతో మార్చి 7న నగరపరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో వీధుల్లో తిరుగుతూ.. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూనే.. అసాంఘిక శక్తుల గుండెల్లో గుబుల పుట్టిస్తున్నారు. కేంద్ర బలగాలు, సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చు చేస్తూ రోడ్లపై తిరిగారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించ వద్దని కోరుతున్నారు పోలీసులు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల వివరాలు, అసాంఘిక చర్యలకు పాల్పడే వారి సమాచారం అందించాలని ప్రజలకు కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *