తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు ఖరారు: కనకమేడల

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.
న్యూదిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం మరోసారి భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో సుమారు 50 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. సమావేశ వివరాలను తెదేపా నేత కనకమేడల మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని తెదేపా, భాజపా, జనసేన నిర్ణయించాయని తెలిపారు.